Wednesday, 28 November 2018

ప్రశ్న: పొలాల్లో వేద పఠనం చేస్తే పంట రాబడి పెరుగుతుందని గోవా ప్రభుత్వం ఆ రాష్ట్ర రైతులకు ఉపదేశించినట్లు విన్నాము. వేదాలు చదివితే పంటలు బాగా పండుతాయా?
- ఎ.శంకర్‌, నెల్లూరు

                    జవాబు : హిందూ మత గ్రంథాలకు, ఆచారాలకు, ప్రార్థనలకు, నినాదాలకు ఎక్కడలేని శక్తి, సామర్థ్యం వున్నాయని ప్రజల్ని నమ్మించడానికి మతతత్వ రాజకీయాలు ప్రయత్నిస్తుంటాయి. వేదాల్లో ఉపనిషత్తుల్లో ఏమీ లేదని ఎవరూ అనరు. అనకూడదు కూడా. కానీ సాహిత్యము, సంగీతం వంటి కళలు మానవ నాగరికతకు, సంస్కృతికి సంబంధించిన అంశాలు. వరి, గోధుమ, బార్లీ, జొన్న, సజ్జ, రాగి వంటి పంటలు మానవావిర్భావం కంటే ముందునుంచీ ఈ భూమ్మీద ఉన్నాయి. మానవుడి ఆవిర్భావం కేవలం 20 లక్షల సంవత్సరాలలోపే కాగా, గడ్డిజాతికి చెందిన ఇలాంటి పంటలు, మొదలయిన ఎన్నో ప్రస్తుతం వ్యవసాయం పరిధిలో వున్న సహజ జాతులు ఈ భూమ్మీద కొన్ని వందల కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఏ వేదాలు, ఉపనిషత్తులు అప్పట్లో లేవు. పైగా మానవుడు అవిర్భవించినప్పటి నుంచి కూడా వేదాలు, పురాణాలు లేవు. వాటి ఉనికికి పట్టుమని పదివేల సంవత్సరాలు కూడా ఉండవు. వేద పఠనాలు లేకుండానే గంజాయి మొక్కలు, భూసారాన్ని కబళించే సర్కారు తుమ్మ, నీటిని కప్పేసే గుర్రపుడెక్కల మొక్కలు విచ్చలవిడిగా పెరిగి అనవసర నష్టాన్ని కలిగిస్తున్నాయి.
వేద పఠనం చేస్తే ఆవులు ఎక్కువగా పాలిస్తాయని, పంటలు బాగా పండుతాయని చాలా అసంబద్ధంగా కొందరు ప్రకటిస్తున్నారు. వేదాల్లో ఏముంటుంది? చదివితే ఎలా వుంటుంది? ఇక్కడ రెండు విషయాలు ప్రస్తావనీయం. 1) వేదాల్లో ఉన్న కథా వస్తువు లేదా అంతస్సారం. 2) వేద పఠనంలో ఉన్న శబ్ద శ్రావ్యత. అంటే- ఓ గేయ గాన సందర్భంలో ఆ గేయంలో ఉన్న అర్థాంశం ఇంకా ఆ గానంలో ఉన్న శ్రావ్యత లయకారం తప్ప మరేమీ అదనంగా లేనట్లే వేదపఠనంలో శ్రావ్యత, వేదాల సారం ఈ రెండే ప్రస్తావనీయాంశాలు. సాహిత్యసారం సామాజికం. మంచి చెడు, వాస్తవా వాస్తవికత, ప్రకృతి వివరణ, వైజ్ఞానిక పరిపుష్టి ఇవన్నీ మానవుడికి అర్థం అవుతాయి. కోతులు, ఈగలు, కుక్కలు, పందులు, ఆవులు, కప్పలు, చేపలు, పాములు, బల్లులు, భల్లూకాలు, మేకలు, గొర్రెలు, బర్రెలు, వానపాములు, గొంగళి పురుగులు వంటి జంతు జాతులను సమావేశపర్చి ఓ సెమినార్‌ హాలులో వాటికి భారత రామాయణాలు, ఖురాన్‌, బైబిల్‌, మార్క్సిజం-లెనినిజం, భౌతిక రసాయనిక శాస్త్రాలు, వాతావరణ కాలుష్యం- నివారణోపాయాలు, రోడ్ల నిర్మాణం, ఆనకట్టల ఆవశ్యకత, కణ శాస్త్రం, ఆహారం జీర్ణమయ్యే విధానం వంటి వాటి మీద ఉపన్యాసాలు ఎంత వివరణాత్మకంగా అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్లుగా చెప్పినా అరటిపండును నోట్లో పెడితే తింటాయేమోగానీ ఆ సెమినార్లో సమాచారం ఆవగింజంతయినా వాటికి అర్థం కాదు. అంటే సామర్థ్యం ఆవశ్యకత, అనుకూలత ఏ జంతువుకూ లేదు. శబ్దాలకు, సంకేతాలకు అంతోఇంతో ప్రతిస్పందించే జంతుజాతులకే సాహిత్య సారం అవసరం, అనుసరం కానప్పుడు వృక్షజాతులయిన పంటలకెలా బోధపడుతుంది? ఇక లయ, శ్రావ్యత వంటి విషయానికొస్తే అటువంటి శబ్ద గ్రాహ్యత మొక్కలకు లేదు. మొక్కలకు జంతువులకున్నట్లు చెవులు, కళ్లు, నాలుక, ముక్కు వంటివి లేవు. కేవలం వాతావరణంలోని ఉష్ణోగ్రతా పీడనాలు, రసాయనిక లక్షణాలు, వెలుగు చీకటి వంటి అంశాల కనుగుణంగా భూసార లక్షణాల ప్రకారం ఎదుగుతాయి గానీ పాటలు, పద్యాలు, నాదాలు, శృతి లయలు వంటి జీవ భౌతిక నియమాలకు (Physiological dictums)  పొసగవు. వేదాలు చదివితే ఆకలి కాదని, ఆకలి కాకపోతే ఉద్యోగం అవసరంలేదని, ఉద్యోగం అవసరం లేకుంటే చదువు అవసరం లేదని చెప్పడానికి వేద పఠనం ద్వారా పంటల వ్యవసాయ రాబడి పెరుగుతుందనడానికి ఆట్టే తేడాలేదు. ప్రజల్ని అజ్ఞానం వైపు, అభూత కల్పనల వైపు వెళ్లేలా చేస్తే ఆ అమాయక మైకంలో వాళ్ల చేత ఏ కార్యకలాపాన్నయినా చేయించుకోవచ్చన్న నిగూఢ రాజకీయోద్దేశ్యం ఈ వేద పఠన సందేశంలో ఉందనడంలో ఆశ్చర్యంలేదు.
- ప్రొ|| ఎ.రామచంద్రయ్య
సంపాదకులు,
చెకుముకి, జనవిజ్ఞాన వేదిక.
email: allikayala@gmail.com

Wednesday, 19 September 2018
*మిత్రులారా*! విశాఖపట్నంలో జరుగనున్న జనవిజ్ఞాన వేదిక 15వ రాష్ట్ర మహాసభలకు విచ్చేస్తున్న ఎన్నికైన ప్రతినిధులకు సూచనలు..
దగ్గరి రైల్వేస్టేషను దువ్వాడ. 10కి.మీ. ఇక్కడినుండి కూర్మన్నపాలెం అక్కది నుండి సెక్టార్ 9 బస్‌స్టాపుకు సిటిబస్సు సౌకర్యము కలదు.
ఉత్తరాంధ్రా మినహా మిగిలిన జిల్లాల నుండి రైలులో వస్తున్న ప్రతినిధులు దువ్వాడ రైల్వేస్టేషనులో దిగవలెను. అక్కడి నుండి మహాసభల ప్రాంగణానికి రవాణా సదుపాయం కలుగజేస్తున్నారు.  లేదా నేరుగా మీరె ఆటోలు, టాక్సి ద్వారా సెక్టార్ 9 బస్‌స్టాప్, స్టీల్‌ప్లాంట్ టౌన్‌షిప్ చేరుకోవచ్చు. 10కి.మీ దూరం.
విశాఖ రైల్వేస్టేషనునుండి 25కి.మీ. ఇక్కడి నుండి 400Y లేదా 400N సిటిబస్సు ఎక్కి సెక్టార్ 9 బస్‌స్టాప్ వద్ద దిగవలేను.
బస్సులో వస్తున్న ప్రతినిధులు కూర్మన్నపాలెం స్టీల్‌ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద దిగవలేను. మహాసభల ప్రాంగణం 7 కి.మి దూరం. ఇక్కడి నుండి రవాణా సదుపాయం ఏర్పాటు చేస్తున్నారు. సిటి బస్సు సౌకర్యం విరివిగా ఉంది.
ప్రతినిధులందరు ముందుగా మహాసభల ప్రాంగణానికి చేరుకోవాలి.
వాతవరణ శాఖ వారి హెచ్చరిక ప్రకారం 21,22తేదిలలో వర్షం పడే అవకాశం ఉంది. కావున గోడుగు/రెయిన్‌కోటు, 2దుప్పట్లు, ఓడామస్ క్రీము తెచ్చుకుంటే మంచిది. కనీష్ట ఉష్ణోగ్రత 26-28డిగ్రీల మధ్య ఉండవచ్చు.
మీకు అవసరమైన, కావలసిన మందులు తెచ్చుకోవడం మరవకండి.
అవసరమైనచో సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు.

  Transport : పరశురాం 9247565904  రత్నారావు 9989722129
  Accomodation  : రత్నారావు 9989722129  వెంకట్రాజు 8331016144
other contact No.s: 7752026789, 7997232443, 9052186766, 9848025687

Visit
www.jvvaps.blogspot.in